![]() |
![]() |
.webp)
సర్కార్ షో లేటెస్ట్ ఎపిసోడ్ కి "పాపం ప్రతాప్" మూవీ వచ్చింది. అందులో తిరువీర్ ఫిమేల్ హోస్ట్ విష్ణు ప్రియా మీద ఒక వెరైటీ కవితను రాసుకొచ్చి చదివి వినిపించాడు. "సుధీర్ విను నేర్చుకో నీకోసం ఎవరైనా రాశారా అలా ఫస్ట్ ఎపిసోడ్ కె " అంటూ విష్ణు సుధీర్ మీద కౌంటర్ వేసింది. ఇక తిరువీర్ కవిత చదవడం స్టార్ట్ చేసాడు. "ప్రియమైన విష్ణు దాచలేను నా క్రష్ ను.
మీరు అమ్మాయి రూపంలో తిరుగుతున్న అత్తరు. మీ కోసమే మరుగుతుంది నా నెత్తురు. విష్ణుప్రియ భీమినేని నిన్ను ఆరాధిస్తూ నా ప్రాణం పోతేపోనీ...రప్ప రప్ప రప్ప నీ అందానికి స్పందించడం నా తప్పా తప్పా తప్పా " అంటూ తెగ చదివేశాడు తిరువీర్. ఈ అందమైన కవితకు విష్ణు ప్రియా తెగ సిగ్గుపడిపోయింది. ఇక తిరువీర్ తో కలిసి డాన్స్ కూడా చేసింది.
విష్ణు సిగ్గు చూసి సుధీర్ నోరెళ్లబెట్టాడు. "ఆవిడని పొగుడుతున్నారు నేనేమన్నా పోగోడొచ్చు కదా" అంటూ ప్రసాద్ బెహరాని అడిగాడు సుధీర్. "నిజానికి మీరే నా ఇన్స్పిరేషన్ అంది. మీ వల్లనే నేను ఎక్కువగా వెబ్ సిరీస్ చూస్తున్నాను" అన్నాడు. "నేను చేసేది షోస్" అన్నాడు సుధీర్. "అవి చూడలేకే వెబ్ సిరీస్ చూస్తున్నాను " అని కౌంటర్ ఇచ్చాడు ప్రసాద్ బెహరా .
![]() |
![]() |